• చిగురుకల కు స్వాగతం

రామకృష్ణయ్య ఎత్తు

 

 

అలనాటి ఆణీముతముత్యాలు

 

కార్డు కథలు  

 

 

రామకృష్ణయ్య ఎత్తు !

~ వైట్‌రోస్‌

 

రామకృష్ణయ్య వట్టి పిసినిగొట్టు, డబ్బున్నా నయాపైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంట్టు చూస్తాడు. అతడు జీవితంలో ఎప్పుడూ ఇంట్లో విస్తరివేసిన పాపాన పోలేదు. రోజూ బ్రాహ్మణార్ధాలే తప్ప ఇంట్లో భోజనం ఏనాడూ ఎరగడు. ఎప్పుడూ తను దానం పట్టగా వచ్చిన గావంచాలు తప్ప వేరొకటికట్టి ఎరగడు. వూళ్ళో అంతా అతణ్ణి '' బ్రాహ్మణార్ధాల రామ కృష్ణయ్య'' అని పిలుస్తూంటారు.

 

ఓసారి మా వూకి కరణంగారింట్లో సంతర్పణ జరిగింది. ఊరందర్నీ భోజనానికి పిల్చారుగాని ఎందువల్లో రామకృష్ణయ్యను పిలవడం మర్చిపోయారు. రామకృష్ణయ్య ఆ రోజు తన్ను కరణంగా రెలాగూ భోజనానికి పిలుసాకతరు కదా అని '' నేనీ రోజు కరణంగారింటికిభోజనాని కెళ్ళాలి. మీ ఇంటికి రాలేనని చెప్పి మరెవరు పిల్చినా వెళ్లఏదు. కరణంగారు తన్ను పిలవక పోతారా అని ఉదయం నుంచీ చూస్తున్నాడు. కానీ, 12 గంటలు దాటినా పిలువలేదు. ఏలాగ? కరణంగారు పిలుస్తారని మరెవరు పిల్చినా వెళ్లఏదు. కరణంగారు పిలువలేదు. ఫలితం తన కెక్కడా భోజనం లేకుండా పోయింది. తనకాకలివేస్తోంది. పొద్దుట్నుంచీ వచ్చి మంచినీళ్ళు పుచుకోలేదు. పోనీ ఇంట్లో భోంచేద్దామంటే అది తనకెప్పుడూ అలవాటు లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్లెవరూ ఇతని కోసం చూడకుండా అంతకు రెండు గంటల క్రితమే భోజనాలు పూర్తి చేసేసి గిన్నెలు కడిగేస్కున్నారు. రామకృష్ణయ్య చాలా ఇరుకున పడ్డాడు.

 

ఒంటిగంట కూడా దాటిపోయింది. కరణంగారింట్లో వడ్డన ప్రరంభమౌతోంది.రామకృష్ణయ్య బాగా ఆలోచించి ఒక ఎత్తు వేశాడు. వెంటనే లేచి కరణంగారింటికి పెరిగెత్తూకుంటూ వెళ్లి '' మా చిన్న పిల్ల కాని ఇలా వచ్చిందా? గంట సేపటి నుంచి కనబడ్డంలేదు. తప్పెడిపోయిందేమోననీ భయపడుతున్నాం'' అన్నాడు. కరణంగారు '' ఊరకే గభరాపడుతున్నారు గాని మీ పిల్లెక్కడో ఆడుకుంటూ వుంటుంది లెండి. అది సరెగాని వడ్డన ప్రారంభమైంది భోజనానికి లేవండి'' అన్నారు. అనటమే తడవుగా అలాంటి చాన్సుకోసమే చూస్తున్న రామకృష్ణయ్య '' ఎందుకు లెండి'' అంటూనే భోజనానికి చతికిలబడ్డాడు.

 

 

 

 

 

చిత్రగుప్తు  సౌజన్యంతో అక్టోబర్‌ 1964

 

 

 

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon