• చిగురుకల కు స్వాగతం

తొలకరి

తొలకరి

 

ఈ తొలకరి మా జీవనంలో....

వసంత రాగాలాపన చేస్తుందనుకొన్నాం....

ఎదురుచూచే ''ఏరువాక'' కొత్త

జీవితానికి జయపతాక అనుకొన్నాం

వర్షించని ఋతురాగం మా ఇంట

అందరికంట కన్నీరే పన్నీరెంది

మా హృదయ క్షేత్రాలన్నీ అప్పుల అడుసులో

''దమ్ము'' అవుతున్నాయి.

ముందటేడు, ఈయేడు, మరుసటేడు

అను''కొంటూ'' కాలం కొలతలతో నిండిన

ఆశా స్వప్నల వనంలో బీళ్ళు - నోళ్ళు తెరిచాయ్‌!

రుణ మాఫీ హామీకి - ఆర్‌.బి.ఐ సైంధవ పాత్ర !

వర్తక అంకెల గారడి తెలియని పల్లెతల్లి గొల్లుమంది !

నేలమ్మనే నమ్మిన మేం... సెలకల్ని, అరకల్ని - స్వేదంతో

 

తడిపాం ! ఆశ (యా)ల నాట్లు వేస్తున్నాం !

నాటిన విత్తుల్ని తూర్పురేఖలు తాకాయ్‌

మా సమస్త వృత్తి చిహ్నలే మొలకలేత్తాయ్‌ !

సమిష్టి సాగు సమరాన్ని స్వాగతించాయ్‌ !

పుష్పించిన మాగాణం ఎర్రబారింది

రేపటి యుద్ధం అనివార్యం అన్నాయ్‌

శాంతి కపోతాలు !!

 

 

 

......   తంగిరాల చక్రవర్తి






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon