యమునా తటి నీ రాకకు ఎదురుచూచున్నదోయి
సాయం సంధ్యసమయం వేచి చూచుచున్నదోయి
సంగీతం నేర్చుకునే వేళ మించి పోతున్నదని
ఎచటనుంచో పక్షులన్ని ఎగిరి వచ్చుచున్నవోయి
ఇసుక తిన్నెలన్ని వెన్న పరుపులుగ మారిపోయె
మన్ను తిన్నవాడు వచ్చు నంచు తలుచుచున్నవోయి
వెదురుపొదలు ఎదలు విచ్చి నీ పాదముల సవ్వడికై
కణపులన్ని కరణములుగా చేసికొనుచున్నవోయి
కన్నయ్యా నీ రాకడ రాధ కొరకె గాదయ్యా
నీ మోహన రవళి కొరకు ప్రకృతి వేచియున్నదోయి.
తుమ్మా రామోహనరావు