• చిగురుకల కు స్వాగతం

కన్నీటి చుక్కలు!

కన్నీటి చుక్కలు!
మా అమ్మ ఓంటికంటి రాక్షసిలా వుంటుంది. ఆమె నాకు పరమ అసహ్యం. ఆమె కుటుంబం అవసరాల కోసం విద్యార్ధులకు, ఉపాద్యాయులకు వంటలు చేసి పెట్టేది.
నేను ప్రాధమిక తరగతి చదువుతున్నప్పుడు పలకరించడానికి పాఠాశాలకు వచ్చింది. అలా రావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆమె అలా రావడం నాకు ఎంతో సిగ్గుగా తోచింది.
ఆమెకు నా సంగతి తెలిసికుడా రావడం సహించలేకపోయాను. ఆమెను నిర్లక్ష్యంగా చూసాను, అక్కడికి వచ్చినందుకు ద్వేషించాను. ఆమె ఎంత మాత్రం నా ప్రవర్తనకు బాధపడలేదు.మీ 'అమ్మ ఓంటి కన్ను రాక్షసి' అని ఆ రోజు సాయంత్రము స్కూలు అయిపోయిన తర్వాత నా స్నేహితులు ఆటపట్టించారు. అమ్మ స్కూలుకు రావడమే కారణమని అమ్మను తిట్టుకొన్నాను.
ఆమె బ్రతికున్నంత కాలం కనిపించకూడదు అనుకున్నాను. ఆమె నా కళ్ళకు కనిపించకుండ చచ్చిపోతే బాగుంటుంది అనిపించింది.
ఇలా ఆమె బ్రతికినంతకాలం ఆమె వలన నేను నవ్వులపాలు కావల్సిందేనని నాకు ఏడుపు వచ్చింది.
అలా జరగాలంటే ముందుగా నేను ఆ ఇంట్లో నుండి బయటపడాలి. ఆమెకు, నాకు ఎలాంటి సంబంధము వుండకూడదని నిర్ణయించుకొన్నాను. బాగా కష్టపడి చదువుకొని మంచి మార్కులు సంపాదించుకొన్నాను.నా కల ఫలించింది అన్నట్లుగానే నేను విదేశాలు వెళ్లి స్ధిరపడటానికి ఆవకాశం వచ్చింది. ఇక అమ్మతో నాకు సంబంధం వుండదనుకొన్నాను.
నా కాళ్ల మీద నిలబడ్డాను అనుకొన్న తర్వాత,నాది, నేను అనే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకొన్నాను. ఆ తర్వాత నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితంలో స్ధిరపడ్డాను. నాకు ఇద్దరు రత్నాలాంటి పిల్లలు. జీవితం ఎలాంటి చీకు చింత లేకుండా సాఫీగా సాగిపోతుంది.ఒకరోజు హఠాత్తుగా అమ్మ నన్ను చూడాలని వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా దూరంగా వుంటున్న అమ్మ మళ్లీ నన్ను చూడటానికి రావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలాగే తన మనవళ్లను చూడటానికి కూడా నేను ఇష్టపడలేదు.
అమ్మ వచ్చి ఇంటి గుమ్మం ముందు నిలబడింది. నా పిల్లలు ఆమెను చూసి కిలకిల నవ్వారు. ఆమె దగ్గరకు ఎక్కడ వెళ్లి మాట్లాడతారోె అనుకుని.... 'ఇక్కడికి నిన్ను ఎవరు రమ్మన్నారు. ఇక్కడికి వచ్చి ఆ గుడ్డి కన్నుతో నా పిల్లలను భయపెట్టాలనుకున్నావా?ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ గట్టిగా రంకెలు వేసాను.
అమ్మ సౌమ్యంగా సమాధానమిచిచ్చంది  'నేను పొరపాటు అడ్రసుకు వచ్చాను.బాబు! నన్ను క్షేమించండి.' అంటూ అమ్మ
అక్కడ నుండి మరో మాట మాట్లాడకుండ వెళ్లిపోయింది.
కొద్ది రోజుల తర్వాత - పూర్వ విద్యార్ధుల సమావేశానికి రమ్మని ఆహ్వానం వచ్చింది. నేను ఆఫీసు పని మీద వెళ్తున్నాను అని నా భార్యతో అబద్ధాం చెప్పి నా చిన్ననాటి స్నేహితులను కలవడానికి బయలుదేరాను.
అక్కడ ఊళ్లో మా పొరుగువారు మా చనిపోయిన విషయం చెప్పారు. ఆమె చనిపోయిందని తెలిసి నాకు ఎలాంటి బాధ కలుగలేదు. ఆమె గురించి ఒక కన్నీటి చుక్క రాల్చలేదు. 
మీ అమ్మ నీకు రాసిన చివర ఉత్తరం అంటూ చేతిలో పెట్టారు పక్కవారు. 
ప్రియమైన కన్న !
నువ్వు నన్ను ద్వేషించినా..... కన్న తల్లిగా నీ మీదగల నా ప్రేమను చంపుకోలేకపోయాను. మీ ఇంటికి వచ్చి ఒకవేళ నా ఆకారంతో నీ పిల్లలను భయపెట్టివుంటే క్షేమించు కన్న. 
నువ్వు మీ పాఠాశాల పూర్వ విద్యార్ధుల సమావేశానికి వస్తున్నావని తెలిసి ఆనందించాను. చనిపోయే లోపల నిన్ను మరోసారి చూడాలని వుంది. అందుకు నా ఆరోగ్యం ఎంత మాత్రం సహకరించడం లేదు.నిన్ను చూస్తాననే నమ్మకం లేదు. 
నేను నీకు ఒక నిజం చెప్పాలి. కన్న ! నీ చిన్నతనంలో నీకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది.నీవు అలా ఓంటి కన్నుతో చూడటం నాకు ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు. నీ తోటివారు కూడా నీ ఓంటి కన్నును చూసి ఎగతాళి చేసినా కన్న తల్లిగా నేను భరించలేను.
 నేను చూడలేని ప్రపంచాన్ని, నా కన్నుతో నువ్వు చూడగలుగుతున్నందుకు నాకు ఎంతో గర్వంగా వుంది. నా గురించి పూర్తిగా మరిచిపోవచ్చు. బాధ కలిగించి వుంటే నన్ను క్షేమించు.
ప్రేమతో ....
మీ అమ్మ
ఆ ఉత్తరం మీద అతడి కంటి నుండి రెండు కన్నీటి చుక్కలు జాలువారాయి. బహుశా - ఆ కన్నీరు రాల్చిన కన్ను. అమ్మ బహుమతిగా ఇచ్చిన కన్ను కాబోలు.
రరరరబొల్లిముంత వెంకటరమణారావు

నిర్వహణ: శైవలిని 

tags

Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon