• చిగురుకల కు స్వాగతం

పాంటమ్

పాంటమ్‌ రచన విధానం ....
ఈ పాంటమ్‌ కవితా ప్రక్రియ మలేషియకు చెందినది. ఇది 15 వ శతాబ్ధానికి చెందిన ప్రక్రియ. ఈ కవిత నాలుగు భాగాలుగా వుంటుంది. ఒకొక్క భాగం నాలుగు వరుసలు కలిగి వుంటుంది. ప్రతి భాగంలోని రెండవ వాక్యం మలి భాగంలో మొదటి వాక్యంగా మొదలవుతుంది. అలాగే ప్రతి భాగంలోని నాలుగవ వాక్యం మలి భాగంలో మూడవ వాక్యంగా వస్తుంది.  కవి భావన శక్తికి అనుగుణంగా ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘ కవితగా వ్రాయడానికి ప్రయత్నించ వచ్చు.
పై కవిత వాక్య  కమ్రాన్ని అంకెలతోచూపించడం జరిగింది.
కవితా నిర్మాణ క్రమం:
 1 2 3 4  
 2 5 4 6
 5 7 6  8
 7 3 8  9
పాంటమ్‌ కవిత వరుస క్రమం పైన వివరించడం జరిగింది  రరరరర
తెర వెనుక మిగిలిన నీడ !
చివరి పేజి సంభాషణలు పూర్తయ్యాయి
పాత్ర నిష్క్రమించే సమయం ఆసన్నమయింది
బంధనాల బంధిఖాన నుండి విడుదలయి
దేహాన్ని ఖాళీ చేస్తున్న సందర్భం అది
పాత్ర నిష్క్రమించే సమయం ఆసన్నమయింది
కొందరు గుండె బరువెక్కి కన్నీరయి వీడ్కోలు పలికారు
దేహాన్ని ఖాళీ చేస్తున్న సందర్భం అది
అలసిన ఆఖరి శ్వాస మౌనంగా నిద్రపోతుంది
కొందరు గుండె బరువెక్కి కన్నీరయి వీడ్కోలు పలికారు
అవయవాలు ఒక్కటిగా ఉపిరిని ఊరితిస్తాయి
అలసిన ఆఖరి శ్వాస మౌనంగా నిద్రపోతుంది
అతను ప్రేరణా శక్తిగా ఎవరి జ్ఞాపకాలలోనో ఉదయిస్తాడు
అవయవాలు ఒక్కటిగా ఉపిరిని ఊరితిస్తాయి
బంధనాల బంధిఖాన నుండి విడుదలయి
అతను ప్రేరణా శక్తిగా ఎవరి జ్ఞాపకాలలోనో ఉదయిస్తాడు
కాలం చెల్లి బొమ్మకట్టిన రూపం వెలిసిపోదు !

పాంటమ్‌

పాంటమ్‌ రచన విధానం ....

ఈ పాంటమ్‌ కవితా ప్రక్రియ మలేషియకు చెందినది. ఇది 15 వ శతాబ్ధానికి చెందిన ప్రక్రియ. ఈ కవిత నాలుగు భాగాలుగా వుంటుంది. ఒకొక్క భాగం నాలుగు వరుసలు కలిగి వుంటుంది. ప్రతి భాగంలోని రెండవ వాక్యం మలి భాగంలో మొదటి వాక్యంగా మొదలవుతుంది. అలాగే ప్రతి భాగంలోని నాలుగవ వాక్యం మలి భాగంలో మూడవ వాక్యంగా వస్తుంది.  కవి భావన శక్తికి అనుగుణంగా ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘ కవితగా వ్రాయడానికి ప్రయత్నించ వచ్చు.

పై కవిత వాక్య  కమ్రాన్ని అంకెలతోచూపించడం జరిగింది.

కవితా నిర్మాణ క్రమం:

 1 2 3 4  

 2 5 4 6

 5 7 6  8

 7 3 8  9

పాంటమ్‌ కవిత వరుస క్రమం పైన వివరించడం జరిగింది .....

తెర వెనుక మిగిలిన నీడ !

చివరి పేజి సంభాషణలు పూర్తయ్యాయి

పాత్ర నిష్క్రమించే సమయం ఆసన్నమయింది

బంధనాల బంధిఖాన నుండి విడుదలయి

దేహాన్ని ఖాళీ చేస్తున్న సందర్భం అది

పాత్ర నిష్క్రమించే సమయం ఆసన్నమయింది

కొందరు గుండె బరువెక్కి కన్నీరయి వీడ్కోలు పలికారు

దేహాన్ని ఖాళీ చేస్తున్న సందర్భం అది

అలసిన ఆఖరి శ్వాస మౌనంగా నిద్రపోతుంది

కొందరు గుండె బరువెక్కి కన్నీరయి వీడ్కోలు పలికారు

అవయవాలు ఒక్కటిగా ఉపిరిని ఊరితిస్తాయి

అలసిన ఆఖరి శ్వాస మౌనంగా నిద్రపోతుంది

అతను ప్రేరణా శక్తిగా ఎవరి జ్ఞాపకాలలోనో ఉదయిస్తాడు

అవయవాలు ఒక్కటిగా ఉపిరిని ఊరితిస్తాయి

బంధనాల బంధిఖాన నుండి విడుదలయి

అతను ప్రేరణా శక్తిగా ఎవరి జ్ఞాపకాలలోనో ఉదయిస్తాడు

కాలం చెల్లి బొమ్మకట్టిన రూపం వెలిసిపోదు !

tags

Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon