• చిగురుకల కు స్వాగతం

పుస్తక పరిచయం

Hridipoochoona

 

పుస్తక పరిచయం

If my poetry aims to achieve anything, it's to deliver people from the limited ways in which they see and feel.

Jim Morrison

 

మనిషి గాయపడ్డప్పుడే గొంతు బలంగా పలుకుతుంది. ఆ వ్యధల సంఘర్షణలు అక్షర రూపంలో అనేక ప్రశ్నలుగా ఉదయిస్తాయి. జయాకర్‌ రోపోలు గారి 'హృది పూచిన గఱిక పూలు' కవిత సంకలనంలో వారి హృది పలికిన పలుకులు మనకు అర్థమౌతాయి.

 

ప్రతి కవిని ఏదో ఒక భావజాలం కదిలిస్తుంది, అతని జీవితాన్ని వెంటాడుతుంది.కేవలం బాధలతో సరిపెట్టుకొకుండా నిరంతరం ప్రశ్నించేవాడు కవి. కేవలం ప్రశ్నలతో సరిపెట్టుకోకుండా.... తన కవిత్వం ద్వారా సమసమాజ నిర్మాణం జరగాలని, ప్రకృతి పచ్చదనంగా ఉండాలని అభిలషిస్తాడు. జయాకర్‌గారి కవితలు కేవలం చదివి ఆనందించడం కోసమే కాదు. సమాజంలో రుగ్మతులను పారద్రోలలని ఆయన ఎంతగానో తపన పడతారు.

 

వస్తువైవిధ్యంతోపాటుగా, భావప్రకటన పటిమన అంత ధృడంగా అభివ్యక్తి కరించారు. అందుకు గుర్తుగా ''మీ జండానైఎగురుతాను'' అనే శీర్షికలో...

 

 

పదండి మీ జండానై ఎగురుతాను

మీ కండలలో గుండెలలో

నవకణాన్నై జ్వలిస్తాను

మీ అఖండ యజ్ఞగుండంలో

సమిధనై దహిస్తాను.  అంటారు.

 

అంటూ అభాగ్యులకు, అనర్తులకు, బాధసర్పదష్టులకు అండగా ఉండి ప్రశ్నిస్తాను అని భరోసా ఇస్తున్నారు రాపోలుగారు.

'కనువిప్పు' అనే శీర్షికలో - మనిషి మానసిక స్థితిగతులను ఆవిష్కరిస్తుంది.

అందుకే ఆయన ఏదైన అందిపుచ్చుకోవాలనుకొన్న- దానిని కాపాడుకోవలనుకొన్న

'బ్రతుకు భగీరథయత్నం'

 

..........................

 

అంటూనే......

 

'నేర్పరి' శీర్షికలో - మనిషిలో శక్తి సామర్ధ్యాలను అభివ్యక్తికరించారు.'ఉక్కు సంకల్పం' శీర్షికలో-

 

తెలంగాణ రాష్ట్ర సాధనకు అద్దం పట్టిన కవిత.

 

'కోటి ఉడుముల పట్టు

 

నా తెలంగాణ జనావళి పట్టు'అంటారు.

 

 జయకర్‌గారి కలం మరింత కొత్తదనంతో జయకేతనం ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ......

 

  కావ్యంతో లోకం పరిమళించాలని

 

గానంతో లోకం పరవశించాలని ..... ఆశిద్దాం.(పరివర్తన)

 

ప్రతులకు

సాహితీమెఖల ప్రచురణలు

 నల్లగొండ

తెలంగాణ రాష్ట్రం                                       

 

 వెల: రూ.94/-

 

 

 

                                                      ..... బొవెర.

 


tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon