• చిగురుకల కు స్వాగతం

Editorial Board

దివ్వే దివ్వే దీపావళి !



పండగలు  పబ్బాలు కాల చక్రపరిభ్రమణంలో నిరంతరాయమానంగా జరుగుతూ వుంటుంది. కాలానికి వెలుగు నీడలున్నట్లే వ్యక్తి జీవితం చీకటి వెలుగుల మధ్య సంచరిస్తుంది. అందుకే మనసు కవి ఆత్రేయ-



'' చీకటి వెలుగుల రంగేళి

   జీవితమే ఒక దీపావళి''



దీపావళిని అభివర్ణించారు. '' దీపం జ్యోతి పరంభ్రహ్మం'' అంటుంది. శాస్త్రం అంటే దీపం పరబ్రమ్మ స్వరూపం  అని అర్ధం. అలాగే దీపం లక్ష్మికి అంటే సౌభాగ్యానికి సంకేతం.

మానవ జీవితం సౌభాగ్యంతో అలరారడానికి 12 నెలలు ఆ ఆనందం నిలబడడానికి ప్రధానంగా కార్తీక మాసంలో చదుర్ధసి, అమవసలలో ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు విశ్వజనులు.

దీపావళి అమావాస్యను తెలుగులోదివ్వెల అమవస అంటారు. దీప స్తభన్ని దివ్వెకంబం అంటారు. కంబం (వికృతి పదం) స్థంబం ప్రకృతి పదం)

దీపాలు పెట్టడాన్ని 'దీవ్వెలెత్తు' అంటారు. అసలు దీపావళి అంటె దివ్వెల సమూహం అని అర్ధం.

దీపం మానవ జీవితంలో అవినాభావ సంబంధం ఏర్పరచుకుంది. 'దీప దర్శనం మహా పాపహరణం' అంటోంది వాజ్ఞయం.

సంస్క ృతిలో మానవంఉలందరూ కలిసి జీవించడానికి ఏర్పరచినవే ఈ పండుగలు. కాలయానంలో ప్రధానంగా దక్షిణాయనంలోనే ఈ పండుగలన్ని చోటు చేసుకోవడం విశేషం. కార్తీక మాసం హరిహరనాధ అర్చన మాసం అటు బిల్వాలు, ఇటు తులసీ దళాలు శివకేశవార్చనకు మూలమూతాయి.

నాగుల చవితి, కార్తిక పూర్ణిమ, సత్యనారాయణ వ్రతం యిత్యాది అంశాలు కార్తీక మాసంలో దీపావళి నుండె ప్రారంభం అవుతాయి.

''గోరంత దీపం కొండంత వెలుగు'' అని దీప ప్రాశశ్త్యాన్ని డా || సి. నారాయణ రెడ్డిగారు తెలియజేశారు. అలాగే దాశరధి కృష్ణమాచార్యుల వారు 'తైలాలు లేకనే వెలిగే దీపం' అంటూనే 'మనసులో దీపం మలిగితె పాపం' అని దీపాన్ని జ్ఞానానికి ప్రతీకగా తెలియజేశారు.

1938 లో భాగవతుల లక్ష్మిపతి శాస్త్రి 'నీతి దీపావళి' పేర పిల్లలకు నీతి కధల పుస్తకం తెచ్చారు.

వైజయంతీ విలాసంలో - '' ఈపము భవహరము, శుభంకరము'' అంటాడు సారంగు తమ్మయ్య.

  తుమ్మల సీతరామమూర్తి చౌదరిగారు  ( తెలుగు లెంక) గా ప్రసిద్ధులు. వీరు దీపావళి ఖండికలో

   చచ్చి చావని బక్క బ్రతుకులు

   సకల మహినుండన్‌

 ఎప్పుడు సంతృప్తిని స్వతంత్రత

 నెల్ల పేదయనుభవించునో

 అపుడు పొంగెదని క్కమగు దీపవాళిని

 గమనించున్‌'' అని తెలియజేశారు.

ప్రవర్తనలను మార్చుకొని వ్యక్తి సమాజంలో హితైషి కావాలని అభిలషిస్తూ జాష్వాగారు '' ఘన ఘనా    

 ఘనము చీకటిమేడ వెలిగించుమెఱపదివ్వెలనూనె  తిరుగలేదు.

దీరుయున్నది హృదయంబు దిద్దుకొనుము'' అని తెలియజేస్తారు.

వేదుల దీపావళి తెల్గు సాహిత్య లోకంలో నిరంతరం వెలిగె శశాంకబింబం.

ఖాళోజి నా గొడవలో -

'' ఊరి వెలుపల నున్న పూరి గుడిశల దూరి

చీకటి బాపలేని దీపాలు '' అంటారు.

ఈ విధంగా కావ్యంలో ఆధునిక కవిత్వంలో, సాహిత్య ప్రక్రియల్లోచీకటిని పారద్రోలుతూ

విహయాసంలో దీపావళి జనుల ఆశావళిగా అనువర్తింపచేసుకుందాం.



దీపావళి వెలుగులు మన లక్ష్యాలను ఫలింపచేసె  వెల్గులుగా మలచుకొందాం.

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon