• చిగురుకల కు స్వాగతం

పుస్తక పరిచయం

సీమకథసుగంధం

సీమకథపుట్టుక పరిణామదశ గురించి పరిశోధకులు- ''డా||అప్పిరెడ్డిహరినాథరెడ్డిగారు'' తన విశేష కృషితో మొదటి తరం కథలను వెలుగులోకి ఈసుకురావడం అభినందనీయం. ఈ కథలు సీమ సాహిత్యంలో నూతన అద్యాయనాన్నికి శ్రీకారం చుట్టాయి. నాటి    సామాజీక స్థితిగతులు, భాషా పరంపర ఈ సంకలనం ద్వారా మనకు అవగతమూతుంది.

 

ఈ సంకలనం సీమకథా సాహిత్య విస్త్రతిని పెంచుతుంది. నూతన పరిశోధకులకు, సాహితీ అభిమానులకు ఈ పుస్తకం సరికొత్త అధ్యాయంగా మిగులుతుంది.

 

ఈ మొదటి తరం కధా సంకలనం(1882 - 1944)వరకు సంబంధించిన మొత్తం 42 కథలను సంకలన పరిచారు. ఈ కథలు కొన్ని గ్రాంధిక భాష, వ్యవహరిక భాషతో ఉన్నాయి. ఈ సంకలనంలో పేరు లభించని కథకులు, లబ్థప్రతిష్టులైన కథలు మనకు కనిపిస్తారు.

 

ఈ కథల నేపద్యంలో మనకు ప్రధానంగా కనిపించే అంశాలు ''వర్తమాన అధునిక సామాజిక అంశాలు, వలసపాలకుల పై పోరాటం, స్వదేశీ వస్త్రాల వాడకం, మద్యనిషేదం, జాతీయోద్యమం , మనిషిలో పెనవేసుకొన్న మూఢవిశ్వాసాల గురించి, వితంతు సమస్యలు, వరకట్నసమస్య, పెత్తందారుల పెత్తనం,పునర్వివాహం, మానవ సంబంధాల మధ్య పెరుగుతున్న అంతరాలు, తదితర అంశాల మీద మనకు కథలు కనిపిస్తాయి.

 

ఈ సంకలనం ద్వారా నిన్నటి తరం గురించి నేటి తరానికి పరిచయం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

 

ఈ పుస్తకాన్ని అబ్జక్రియేషన్స్‌ ద్వారా శ్రీ కోడిహళ్లి మురళిమోహన్‌గారు ఉత్తమ సాహిత్య సంకలనాన్ని తీసుసకురావడం అభినందనీయం.

 

ప్రచురణలు :

అబ్జక్రియేషన్స్‌

సాహిత్య సంస్కృతి సంస్థ

హైదరాబాద్‌

ఫోన్‌ : 9701371256

వెల : 200/-

 

 

 

 

 

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon