• చిగురుకల కు స్వాగతం

శకుంతలా !





            నా కుటిలత్వాన్ని మన్నించవా శకుంతలా !
                                           ... నంబూరి పరిపూర్ణ


తండ్రి కణ్వమహర్షి ఆశ్రమానికి వీడ్కోలు పలికి ఓ వృద్ధ ఆశ్రమవాసిని తోడు రాగా దుష్యంతుని దర్బారులొ అడుగిడుతున్న శకుంతల మనసు గాలిలో తేలుతోంది. ఆశలు ఆశల ఆకాశంలో విహరిస్తున్నాయి. తన యౌవనాన్నీ, జీవితాన్నీ సార్ధకం చేసిన ప్రాణేశ్వరుణ్ణి బహుకాల నిరీక్షణ తరువాత కలవబోతోంది. తనను హఠాత్తుగా చూడగానే అతని కనులు ఎన్ని వెలుగులు జిమ్ముతాయో ! ప్రియా సమాగమం ఎంత మధురం ... ఎంత అద్వితీయం!

తీయని ఊహలతో, మందహాసంలో మెల్లగా నడచి వచ్చి రాజు ఎదుట నిలిచి అతని కన్నులలోకి స్నిగ్ధమనోహరంగా చూపించి శకుంతల.

దుష్యంతుడు గాంభీర్యాన్ని సడలనీయక మరో దిశకు చూపు మరల్చాడు. ముఖంలో ఏ భావ వీచికా లేదు. మనిషిలో ఏ స్పందనా లేదు. సభా సదులంతా అతని వైపూ, వచ్చిన ఇరువురి స్త్రీల వైపూ కౌతుకంతో తేరిపారజూస్తున్నారు. పల్లెసీమల స్త్రీలెవరో, ఏదో వేడికోలు చేసుకొనుటకు తన దర్శనము అర్ధించినారని తలచాడు దుష్యంతుడు. కానీ పరిస్థితి అవాంఛనీయంగా మారింది ఎదుర్కొనక తప్పదు.

'' పడతులారా ! ఏమి విన్నవింప వచ్చారు? ఏమిటి మీ అభ్యర్ధన ?ఆలసింపక తెలపండి'' అనుజ ఇచ్చాడు.

మహారాజు ప్రశ్నకు వృద్ధమాత చకితురాలయ్యింది. భయ సంకోచాలతో తడబడుతూ  ''మహారాజులకు మా అభివాదములు ప్రభువులకు మేము గుర్తున్నట్టు లేదు. ఈ బాలిక కణ్వ మహర్షి పుత్రికయూ, మీ ప్రియపత్నియూ అయిన శకుంతల, మృగయా వినోద సందర్భంగా మహారాజు మా ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఈమెను చూసి గాఢంగా వలచాడు. వెంటనే గాంధర్వ వివాహామాడి ధర్మపత్నిగా స్వీకరించారు. ఇప్పుడిమే గర్భంలో మీ ఇరువురి అనురాగఫలం ఊపిరిపోసుకుంటున్నది. మరల వచ్చి తమ అంతఃపురానికి తనను గొనిపోయెదమన్న మీ వాగ్దానము నిజమగు రోజు కోసం ఎంతయో నిరీక్షించి, ఫలితము గానక స్వయంగా మీదరిజేర వచ్చింది. ప్రభూ ! ఇంక మీ సొమ్ము మీకప్పగించుతున్నాను.స్వీకరింప ప్రార్ధన''

సభికులంతా నిశ్చేష్టులై రాజు వైపే చూపులు నిలిపారు. అందరి ఎదుటా లజ్జతో న్యూనతాభావంతో కుచించుకుపోతూ ''ఔరా ! ఎంతటి కల్పనా చాతుర్యము ! నమ్మిక పుట్టించు మంచి కథ! ఈ దుష్యంత మహారాజు ఒక వనకాంతను వరించి భార్యగా గ్రహించుటయా? అసంభవము'' ఆగ్రహపడ్డాడు రాజు.

'' ప్రభూ ! సదా దైవచింతనలో నిమగ్నమైయుండు ఆశ్రమవాసులు అసత్యమాడు సాహసం చేయలేనివారం. ఈ శకుంతల మీ అపూర్వ ప్రేమను చూరగొన్న మీ ధర్మపత్ని ముమ్మాటికి ఇది సత్యం''

'' చాలించు నీ వాచాలత. ఎంతటి తెంపరితనము ఈ కన్యను మేమెన్నడు చూసియే ఎరుగము'' అని గద్దించి ... మరల క్షణమాలోచించి '' నీవన్న నిజమే అయినట్టయితే మాకీ కాంతతో సాంగత్యమున్నట్టు నిదర్శనమును చూపగలరా? వున్నచో రుజువు పరచమని మా ఆజ్ఞ''

శకుంతల విస్మయంగా విభుని వంక చూసింది. వెంటనే గాంధర్వ వివాహ సమయంలో అతడు తన వ్రేలికి తొడిగిన ఉంగరం జ్ఞాపకమిచ్చి దాని కోసం వ్రేలు తడుముకుంది...'' అయ్యో ఏదీ అంగుళీయకం?  ఈరోజు ఒక దేశాధినేత కావచ్చు. కానీ, అతడు నా ప్రియుడు. నా భర్త! కానీ, ఇతడు మా ప్రణయ గాథనుగానీ, మా వివాహూదంతాన్నిగానీ గుర్తుంచుకోనకపోవుట ఎంత విచిత్రము ! ఇది నమ్మశక్యమా? ...పోనీ, అతనన్న విధంగా ఉంగరాన్ని నిదర్శనంగా చూపుదామన్న అదీ లేకపోయనే ! ఎలా మాయమయ్యిందది? ఆ నౌకలో గంగానది దాటుతుండగా తన చేతిని అలలకు తాకించి అడింది. అప్పుడే అది గంగపాలయి వుంటుంది. పరమేశ్వరా ! ప్రత్యక్షంగా వున్న ప్రాణి కంటే ప్రాణంలేని ఉంగరమే బలమైన సాక్ష్యమయ్యే స్థితిని కల్పించారవా?

ఊహించని భంగపాటుతో శకుంతల ఆపదమస్తకం కంపించిపోయింది, ప్రేమ నిండిన గుండెలు ఏదో తెలియని విద్రోహానికి గురై నెత్తురోడుతున్నాయి. పతిని బేలగా, జాలిగా చూస్తూ అడుగులు తడబడుతూ వెడలి వస్తున్న శకుంతలను వృద్ధమాత తన గుండెలకు అదుముకుని కన్నీరుమున్నీరయ్యింది.

''అమ్మా ! దుష్యంతుడు మన ఆశ్రమానికొచ్చి నిన్ను చూసి వలచినప్పుడు నీ తండ్రి పరస్థలమేగేను. ఆయన తిరిగి రాక ముందే, సమ్మతి తెలుపక ముందే నిన్ను గాంధర్వ వివాహామాడి పత్నిని చేసుకున్నాడు. అతనిని నీవునూ త్రికరణశుద్ధితో భర్తగా గ్రహించావు  లోకంలోని ప్రతి జీవి స్వీయకర్మ బద్ధమైనది. కాగా వివాహితులు భర్త చెంతనుండుట సాంప్రదాయం. ఆ విధి ననుసరించి నిన్ను తిరిగి ఆశ్రమానికి చేర్చగూడదు.... తల్లీ ! ఆశ్రయహీనవగు నిన్ను వదిలిపోక తప్పదను తలంపే గుండెలు బద్ధలు చేస్తున్నది. కానీ తప్పదు. విధివంచితవగు నా తల్లీ....నాకు శెలవిమ్ము'' అంటూ త్వరత్వరగా ముందుకు సాగిపోయింది వృద్ధమాత.

శకుంతల విభ్రమంతో కలలోలాగా కోట ప్రాకారాలను ఒక్కటొక్కటిగా దాటి చివరి ప్రాకరముఖ ద్వారంలో నిలబడింది. మనశ్శరీరాలు స్తంభించాయి. పంచేంద్రీయాల జ్ఞానంపోయింది. కొంత సమయమలా గడిచాక తిరిగి చైతన్యం పొందిన దేహం ఆలోచించడం మొదలుపెట్టింది.

ఈ రాజు తన ప్రియతముడన్నది గత కాలపు సంగతి. తనకిప్పుడు అతడు ఒక రాజ్యపాలకుడు తప్ప వేరొకటి కాదు. ఇప్పుడతనికి నేను పరాయి స్త్రీని తన స్త్రీగా స్వీకరింపమని పలుమార్లు ప్రార్ధించినా పరిగ్రహించు ఉద్దేశ్యము లేదు. అటు నా తండ్రి చెంత సయితం నాకు చోటు లేదు. ఆధారమూ, నెలవూ, బ్రతికేందుకోక కారణమూలేని ఈ బ్రతుకింకెందుకు? భూమికి బరువవ్వడానికా?

రరరర

పూర్తిగా నిస్పృహకులోనై తనను తాను అంతం చేసుకుందామని తలుస్తున్న శకుంతలకు హఠాత్తుగా అంతర్వాణి  పలుకులు వినిపించాయి. ''బతకడానికి నీకు హేతువు లేకేమి? నీ ప్రేమ ప్రతిరూపం నీలో ఎంత నిశ్చింతగా పెరుగుతున్నదో గమనించు. ఆప్రాణిని భూమి మీదికి తెచ్చి లోకాన్ని చూడనివ్వు. ఆ ప్రాణి నిశ్చయంగా బాలుడే. అతడ్ని అసాధరణ వ్యక్తిగా, వీరుడిగా తీర్చిదిద్దు. నీ తనయుడు అన్ని విధముల తండ్రి తలదన్నువాడుగా రూపొందాలి. పురుషులకు అందునా రాజ్యాధిపతులకు మోహవేశం తప్ప పర్యవసానంతో నిమిత్తముండదు. నీవు పాపపుణ్యము లెరిగిన సాధారణ స్త్రీవి. మమతామానవత్వమున్న మాతృమూర్తిగా నీ బిడ్డకు బాసటగా నిలిచి, భవిష్యత్‌ ప్రదాతవు కావాలి.''

అంతర్వాణి ఆదేశం వినిపించిన ఆ క్షణం శకుంతలకు ఒక మహత్తర సంధికాలం. అయినా, ఆ ఉద్బోధన ఆమెను డోలాయమాన స్థితి నుంచి దృడ నిశ్చయం గాంధర్వ వివాహామాడి పత్నిని చేసుకున్నాడు. అతనిని నీవునూ త్రికరణశుద్ధితో భర్తగా గ్రహించావు  లోకంలోని ప్రతి జీవి స్వీయకర్మ బద్ధమైనది. కాగా వివాహితులు భర్త చెంతనుండుట సాంప్రదాయం. ఆ విధి ననుసరించి నిన్ను తిరిగి ఆశ్రమానికి చేర్చగూడదు.... తల్లీ ! ఆశ్రయహీనవగు నిన్ను వదిలిపోక తప్పదను తలంపే గుండెలు బద్ధలు చేస్తున్నది. కానీ తప్పదు. విధివంచితవగు నా తల్లీ....నాకు శెలవిమ్ము'' అంటూ త్వరత్వరగా ముందుకు సాగిపోయింది వృద్ధమాత.

శకుంతల విభ్రమంతో కలలోలాగా కోట ప్రాకారాలను ఒక్కటొక్కటిగా దాటి చివరి ప్రాకరముఖ ద్వారంలో నిలబడింది. మనశ్శరీరాలు స్తంభించాయి. పంచేంద్రీయాల జ్ఞానంపోయింది. కొంత సమయమలా గడిచాక తిరిగి చైతన్యం పొందిన దేహం ఆలోచించడం మొదలుపెట్టింది.

ఈ రాజు తన ప్రియతముడన్నది గత కాలపు సంగతి. తనకిప్పుడు అతడు ఒక రాజ్యపాలకుడు తప్ప వేరొకటి కాదు. ఇప్పుడతనికి నేను పరాయి స్త్రీని తన స్త్రీగా స్వీకరింపమని పలుమార్లు ప్రార్ధించినా పరిగ్రహించు ఉద్దేశ్యము లేదు. అటు నా తండ్రి చెంత సయితం నాకు చోటు లేదు. ఆధారమూ, నెలవూ, బ్రతికేందుకోక కారణమూలేని ఈ బ్రతుకింకెందుకు? భూమికి బరువవ్వడానికా?

రరరర

పూర్తిగా నిస్పృహకులోనై తనను తాను అంతం చేసుకుందామని తలుస్తున్న శకుంతలకు హఠాత్తుగా అంతర్వాణి  పలుకులు వినిపించాయి. ''బతకడానికి నీకు హేతువు లేకేమి? నీ ప్రేమ ప్రతిరూపం నీలో ఎంత నిశ్చింతగా పెరుగుతున్నదో గమనించు. ఆప్రాణిని భూమి మీదికి తెచ్చి లోకాన్ని చూడనివ్వు. ఆ ప్రాణి నిశ్చయంగా బాలుడే. అతడ్ని అసాధరణ వ్యక్తిగా, వీరుడిగా తీర్చిదిద్దు. నీ తనయుడు అన్ని విధముల తండ్రి తలదన్నువాడుగా రూపొందాలి. పురుషులకు అందునా రాజ్యాధిపతులకు మోహవేశం తప్ప పర్యవసానంతో నిమిత్తముండదు. నీవు పాపపుణ్యము లెరిగిన సాధారణ స్త్రీవి. మమతామానవత్వమున్న మాతృమూర్తిగా నీ బిడ్డకు బాసటగా నిలిచి, భవిష్యత్‌ ప్రదాతవు కావాలి.''

అంతర్వాణి ఆదేశం వినిపించిన ఆ క్షణం శకుంతలకు ఒక మహత్తర సంధికాలం. అయినా, ఆ ఉద్బోధన ఆమెను డోలాయమాన స్థితి నుంచి దృడ నిశ్చయం వైపు మరల్చింది.ఆమె ఇక ఆలోచించలేదు. వెనుదిరిగి చూడలేదు. సూటిగా అరణ్య అంతర్భాగంలోకి నడిచింది. తలదాచుకునేందుకు నెలవును వెదికింది. చిన్నపర్వతపాదం చెంత ఓ చిన్న గుహను ఆశ్రమంగా చేసుకుని, క్షణక్షణంగా దినదినంగా జీవితాన్ని ముందుకు సాగిస్తోంది. చుట్టూతా క్రూరమృగ జంతతుల భీకరధ్వనులు హళాత్తుగా పెనుగాలులు వీచి ఫెళ్ళున విరిగిపడుతున్న చెట్ల కోమ్మలు ! అవిరామంగా కురిసే  ముసురు వర్షాలు తన జీవితేచ్చ ముందు శకుంతలకు ఇవేవీ గణింపతగ్గవి గావు. బండరాళ్ళతో తాను ఒక ఛాయై, మొండిగా బ్రతకసాగింది.

ఇప్పుడామెకు వనసీమల వన్యప్రాణులతో చక్కని చెలిమి ఏర్పడింది. అవి కూడా ఈ మానవి పట్ల భయం తోలగడంతో, విశ్వాసంతో మెలుగుతున్నాయి. నెలలు నిండిన శకుంతల ఒకనాడు వన్యజీవులంత సహజంగా మగశిశువును కన్నది. ముందే భద్రపరిచిన ఆహారంతో కొన్ని దినాలు గడిపింది. అటు తరువాత బిడ్డను వీపున గట్టుకుని తిరుగుతూ, పండ్లనూ, దుంపలనూ, లేలేత వేళ్ళనూ సేకరించ సాగింది. ఆరు నెలల బిడ్డడు పాకుతూ సమీప గుహల్లోని సింహాలు, పులులు వద్దకు పోయి, వాటి జూలు పట్టుకు లాగుతూ వాటి కూనలతో ఆటలాడుతున్నాడు. బాగా ఆడి అలసి నిద్రస్తున్న పసివాణ్ణి కనుల నిండుగా చూసుకుంటూ గుహద్వారంలో కూర్చున్న శకుంతల గత జీవిత సింహవలోకనంలో పడింది.

రరరర

ఎంత విచిత్రమైన మలుపు తిరిగింది తన బ్రతుకు ! అసలు తన పుట్టుకే విచిత్ర సంఘటన గదా ! తన తల్లి మేనక దేవేంద్రుడు, విశ్వామిత్ర మహర్షిని సమ్మోహనపరిచి, అతడి యజ్ఞకర్మలను భగ్నం చెయ్యమని భూలోకానికి పంపించాడు. స్వార్థచింతనతో ఇంద్రుడలా  పంపడమే అనైతికమైతే గొప్ప రాజర్షి అయివుండి, కామావేవేశంతో ఆమెను అనుభవించి తన జన్మకు కారకుడైన కౌశికుని అల్పబుద్ధినేమన వలెను? అది చాలక తనకు పుట్టిన బిడ్డను కాదనుట ఏవిధమైన న్యాయము? సర్వ ప్రాణుల హితమునకై తపమాచరించే రుషులకు తగినదేనా ఈ ఆదరణ?

తల్లి మాత్రం చేసిందేమిటి? పసిగుడ్డును వనంలో వదిలి ఇంద్రసభకు తరలిపోయింది. పాపం ఆమె ఇంద్రుని ఆజ్ఞబద్దురాలు మాతృసహజ మమతలను తెంపుకోక తప్పలేదు గాబోలు. అతడి సభలో సదా నాట్యమాడుతూ తప్పస్యులు మోహపరిచి తపోభంగం చెయ్యడమే దేవ వేశ్యల పనిగావచ్చునా? ప్రాణికోటిలో విశిష్టులూ, దేవాంశకులు అనబడే దేవతల్లోనూ వేశ్యజాతి ఒకటుండేదేమో?! వారిని ఇంద్రుడు స్వకార్యసిద్ధికి ఉపకరణాలుగా వాడటమేమిటో!

వనంలో దిక్కుమాలి పడివున్న తనను పండ్లు ఫలాలు పెట్టి కాపాడిన ఆ శాకుంతలముల కారుణ్యమెట్టిది! ఆ పిమ్మట కణ్వమహర్షి తనను ప్రేమవాత్యాల్యాలతో పెంచడం ఎంత మహనీయత! ఆ తండ్రి ప్రేమే గాదు.... ఆశ్రమంలోని అందరి ప్రేమా, అక్కడి పశుపక్ష్యాదుల ఆత్మీయతలు ఎంతగా లభించాయి!

అట్టి ప్రేమపూరిత వాతావరణం నుంచి విడదీసి ఈ భీకరారణ్యంలోకి విసిరాడు విధి ! నిజంగా విధియేనా .... నేటి నా దుస్థితికి కారణం? కాదు కాదు ... ఏంత మాత్రం కాదు. నా  పై ప్రేమ కురిపించి చతుర భాషణలతో మురిపించి వశపర్చుకున్నాడు దుష్యంతుడు. స్థలాంతరంలో వున్న తన తండ్రి వచ్చి తన సమ్మతి తెలుపేంత వరకూ వివాహ ప్రసక్తి తేవలదని తనెంత బ్రతిమాలినా, తన పట్టు విడవకుండా అప్పటికప్పుడు గాంధర్వ వివాహమాడి తనను పత్నిని చేసుకున్నాడు ఈ దుష్యంతుడు. తను తను రంగారు శోెభలతో పొంగారు సౌరభాలతో అప్పుడే విచ్చుకుంటున్న పూమొగ్గ ! ప్రకృతి సహజ శృంగార భావనలను నిలువరింపజాలని పిన్నవయసు ! లోకపు తీరు ఎరుగని అమాయకత, అపరిమిత వాంఛతో పసిమొగ్గను ఆబగా అఘ్రాణించి విసిరి పారవేచాడు దుష్యంతుడు. వయసుకత్తె కనబడగానే ఆమె శీలమిలా దోచుకుందామా అని సామాన్యులే తహతహలాడేటప్పుడు రాజంతటి వాడికి అడ్డేమిటి? తన రాజ్యంలో అందమైన ప్రతి వస్తువూ అతనిది అవుతుందట. ఇంత మాత్రం తెలియక అతడు నిజంగానే తనను మనసారా ప్రేమించి, ప్రత్నిగా స్వీకరించాడనుకొన్నది.

మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది. కానీ, తను భ్రష్టురాలు కాదు. అభాగిని కాదలచుకొలేదు. తల్లిగా తన ధర్మాన్ని సంఫూర్ణంగా నెరవేర్చి తీరుతుంది. సంకల్పాన్ని క్రియగా మార్చేందుకు నడుము బిగించింది శకుంతల. చేతననైన విధంగా గురి చూసి బాణాలతో కొట్టడం నేర్పి సాధన చేసింది. నైపుణ్యం సాధించాక కుమారుడికి నేర్పడం ప్రారంభించింది. సమీపవనాల్లోని మునులకు తన పూర్వపరాలు చెప్పి కొడుకును వారి శిష్యుడుగా అప్పగించింది. దయతో తమ విద్యలనన్నీ బోధించమని అర్ధించింది. ముద్దుగా గొప్ప ముఖవర్చస్సుతో, సునిశిత గ్రహణాశక్తితో వున్న ఆబాలుణ్ణి మునులందరూ ఆదిరించారు. వేదవిద్యలను, అస్త్రశాస్త్రముల మెళుకువలను బోధిచారు! అంతేగాదు .... రాజ్యతంత్ర వ్యవహారాలు కూడా క్షుణంగా నేర్పి సర్వశక్తి సంపన్నుడుగా తీర్చిదిద్దారు.

రరరర

దుష్యంత మహారాజు తమ అడవికి వేటకై వస్తున్నారన్న వార్త ఆటవికుల్ని మిక్కిలి ఉత్సాహపరిచింది. ఆయన విచ్చేస్తున్నదీ రోజే. తమ నెలవుల్లో వున్న మృతాలను కదిలించి, పరుగులెత్తించే ఉద్ధేశంతో గిరిజనులు డప్పులూ డోళ్ళూ మోగిస్తూ అడవి లోతట్టుకు వెడుతున్నారు. దుష్యంతడు అరణ్య ప్రవేశం చేసినట్టు రధ చక్రాల కర్కశ ధ్వనులు తెల్పుతున్నాయి. గుర్ర్రపు గిట్టల తాకిడికి లేచిన ధూళి ఇరువైపుల చెట్ల ఆకులకు జేగురు రంగు పులుముతోంది. రాజు ఆటవిక బృందాలను కలిశాడు. వేట మిదలయ్యింది. వాయువేగంతో వస్తున్న బాణాలను కుందేళ్లూ, దుప్పులూ, లేళ్ళూ,తెగవతో పరుగులు పెడుతున్నాయి. ఎరకోసం పొదల్లో మాటువేసిన సింహాలూ, నీళ్ళ కోసం సెలయేళ్లలో దిగిన పులులూ అడవిలో వినిపిస్తున్న ధ్వనులకు ఘీంకారాల గాండ్రిపులతో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రొద్దువాలే వేళకు వేట ముగిసింది.  అందాల హరిణాల్నీ, అడవి పందుల్నీ, ఒక పులినీ దుష్యంతుడు సంహరించాడు. తృప్తితో, ఆనందంతో రాజధాని తిరుగు ప్రయాణమై రధాన్ని కొంత దూరరం పోనిచ్చినంతలో అతని దృష్టి సంహాలతో ఆడుతున్న ఒక బాలుని మీద పడింది. అతడు వాటి మూపులపైకెక్కి కవ్వించి పరుగెత్తించడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికొచ్చి....''కుమారా ! నీవెవ్వరవు? నీ తల్లిదండ్రలెవ్వరు? ఈ క్రూర జంతువుల మైత్రి నీకెట్లు కుదిరింది? భళీ భళీ ! నీ సాహసవిక్రమాలనేమని కొనియాడుదును ? సత్వరమే నిన్ను కన్నవారిని నాకు చూపుము! ఇది నా అభ్యర్ధన!'' అన్నాడు రాజు.

బాలుడు వినయంగా దుష్యంతుడ్ని తన గుహకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడతడు శకుంతలను చూచి తానేవరో వివరించిన మీదట.... ఈ ఆటవిక స్త్రీ ఇంతటి పరాక్రమవండుడెలా పుట్టాడు? ఇంతటివాణ్ణి ఎలా చేసింది? వితర్కంలో పడ్డాడు రాజు అతడిని శకుంతల గుర్తించినా తానెవరో తెలలపడానికి ఇష్టం కలగడం లేదు. తను తిరస్కృతిని, నిరాదరణనూ, అవమానాన్నీ మరిచిపోగలదా ! ఆ గాయలింకా పచ్చిగానే వున్నాయే ! శకుంతల అవాసానికి దుష్యంతుడోచ్చిన వార్త తెలిసిన మునులందరూ తమ ఆశ్రమాలు వదలి బిలబిల వచ్చారు. అతనిచే తిరస్కరింపబడి, అడవిజేరిన శకుంతల ఎన్ని కష్టనష్టాలను నిర్భయంగా ఎదుర్కొంటన్నదో తన కుమారుణ్ణి స్వీయకృషితో, మునుల చెంత శిష్యరికంతో సకల విద్యా పారంగతునిగా ఎలా రూపొందిచించిన వైనాలుగా రాజుకెరిగించారు మునులు.

దుష్యంతుని శిరస్సు లజ్జా బారంతో వంగిపోయింది. అణువణువూ పశ్చాత్తాపంతో దగ్ధమవుతోంది. అతి నెమ్మదిగా, సౌమ్యంగా ఆమెను సమీపించి ''ప్రియే ! శకుంతలా ! రాజవంశీకులకూ, అన్య రాజుల అపహేళనలకూ వెరచి నిర్ధయగా నిన్ను పరిత్యజించాను.

నీవు మాత్రం అసమాన పరాక్రమశాలి అయిన కుమారుణ్ణి నాకు ప్రసాదించావు. నా కుటిలత్వాన్ని మన్నించి, నన్ను క్షమించు. నా వెంట కుమారుని సహితంగా రాజధానికి రమ్మని వేడుకుంటున్నాను'' దీనంగా అర్ధించాడు దుష్యంతుడు.

శకుంతల రాజధానికి చేరడానికి గానీ, అంతఃపురవాసానికి గానీ ఏ మాత్రం అంగీకరించలేదు. దుష్యంతుడు తన వెడికోలును కొనసాగిస్తూ'' నా పట్టమహిషికీ,సహపత్నులకూ జన్మించిన వారిలో నా కుమారుడంతటి సర్వజ్ఞుడు మరిలేడు. తన అసమాన విక్రమంతో శతృరాజుల దాడుల్ని జయప్రదంగా ఎదుర్కొని రాజ్యాన్ని భద్రంగా కాపాడగలడు. క్రూరమృగములతో స్నేహంగా, సహజీవనం చెయ్యగల మన పుత్రుడు అకారణంగా ద్వేషించే, అసూయపడే పొరుగు రాజుల్ని మిత్రులుగా మార్చివేయగలడు. ఇతడు గాక మరెవ్వరూ నా రాజ్యవారసులు కాజాలరు'' అని ప్రకటించాడు.

మునీశ్వరలు శకుంతలను అనేక విధముల సమాధానపరిచి రాజు ననుసరించి వెళ్లి తన కుమారుని రాజ్యాధినేతను చేయమని కోరారు.  వారందిరి ప్రోద్భల ఆశీర్వాదాలతో శకుంతల కుమారునితో పాటు రధమెక్కింది.

ఆ కుమారుడే జంబూద్వీపాన్నతా ఏకఛత్రాధిపత్యంగా, సుభిక్షంగా, ప్రజాహితంగా ఏలిన భరతుడు. అతడి పేరుతోనే ఈ భూఖండం భరత ఖండంగా ప్రసిద్ధి చెందింది !!






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon