• చిగురుకల కు స్వాగతం

కథ

గాలిబుడగల అబ్బాయి !



ఒకసారి  నెహ్రూ  తమిళనాడులో పర్యటిస్తున్నారు. అక్కడ  రోడ్డుకు ఇరువైపుల ప్రజలు తండోప తండాలుగా నిలబడి  ఉన్నారు. నెహ్రూ చూడాలని. అతని మాటలు వినాలని. అక్కడ  పిల్లలు కూడా గుమికూడారు , మరి కొందరు చెట్ల మీద కు  ఎక్కారు. చాచా నెహ్రూకు స్వాగతం పలకాలని.

ఇంతలో నెహ్రూగారు ప్రయాణిస్తున్న కారు, ఇతర వాహానాలు వెంబడించసాగాయి. చాచాజీ జిందాబాద్‌' అంటూ పిల్లలు చేతులుపూతు తన ఆనందాన్ని వ్యక్తం చేయసాగారు.

నెహ్రూ కూడా చేతులూపుతూ తన ఆనందం తెలియజేసారు. ఇంతలో అతనికి దూరంగా గాలి బుడగలు అమ్ముకునే అబ్బాయి కనిపించాడు. ఆ బుడగల రంగులను చూస్తుంటే.......  ఆ పిల్లల మధ్య ఇంద్ర ధనస్సును చూసినట్లుగా ఉంది. నెహ్రూ తన కారు అపమని. ఒక్క ఉదటున దిగిపోయారు. గాలిబుడగల అబ్బాయికి సైగ చేసారు దగ్గరకు రమ్మని.

గాలిబుడగలవాడు కంగారుపడుతూ దగ్గరకు వచ్చాడు. నెహ్రూకు అతని మీద ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు ఏమి జరగపోతుంది? అని అక్కడవారు కంగారు పడ్డారు. గాలిబుడగల అచ్చాయి తలవంచుకు నిలబడ్డాడు. తన సహాయకులను ఆదేశించారు గాలి బుడగల మొత్తం ఖరీదు చేసి  '' ఇక్కడ ఉన్న నీ చిన్నారి నేస్తాల అందరికి బుడగలు ఇవ్వమని'' చెప్పారు.

గాలి బుడగల అబ్బాయి ఆ మాటలకు సంబరపడిపోయి. తల ఎత్తడు.  బుడగలు తీసుకు వచ్చి పిల్లల చేతికి ఒకోక్క గాలి బుడగ ఇవ్వసాగాడు. '' పిల్లలు ఆనందంతో చాచాజీ జిందాబాద్‌' అని ఆనందంతో గంతులేయసాగారు.

నెహ్రూ ఆ పిల్లల తోటలో నడుస్తూ- ఒక చిన్నారి దగ్గర ఆగిపోయారు. ఆ పాప తన చేతిలో గాలి బుడగ రంగును చూసి ముద్దడసాగింది. నెహ్రూ ఆ పాప బుగ్గలను చిన్నాగా తట్టి. తన కారు ఎక్కారు. పిల్లల ఆనందంతో 'చాచాజీ  మీ బహుమతి బాగుందని' అరవసాగారు.






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon