వర్ణ చిత్రాలు
నీ కల్పనాశక్తి అమోఘం
ఈ అపూర్వ అద్భుత సృష్టి చక్ర భ్రమణంలోని
కోటానుకోట్ల జీవరాశిలో
నన్ను ఓ చిరుప్రాణిగా చలన శీలగా సృష్టించావు
బాల్య, కూమార యూవన, వృద్ధాప్యాలు
వసంతగ్రీష్మాలు, హేవంత శిశిరాలు,
భూ భ్రమణ పరి భ్రమణాలు
పగలు, రేయిల గమనా గమనాలు
వికసిస్తున్న విజ్ఞానాద్భుతాలు
పతనమూతున్న మానవ విలువలు
ఆవిష్కరింబబడుతున్న జీవ రహస్యాలు
అంతరించిపోతున్న జీవజాతులు
అల్లుకుపోతున్న ఆర్థిక బంధాలు
అడుగంటుతున్న బాంధవ్యాలు
పల్లవించే స్నేహరాగాఉ
వంచించే నమ్మకద్రోహాలు
విస్తరించే వ్యాపార విలువలు
నెత్తురు చిమ్మే ఆర్థిక వైరాలు
ధనవంతుల కేళీ విలాసాలు
అన్నార్తుల ఆకలి మేడలు
తళుకులీనే కాంతి మేడలు
కాంతినోచని పూరి గుడిసెలు
ఉత్కంఠభరిత వార్తా శీర్షికలు
ఊహకందని రాజకీయ జూదాలు
ఆస్తిక, నాస్తిక, తార్కిక తత్త్వాలు
లౌకిక అలౌకిక భావజాలాలు
చిత్రవిచిత్ర వేషధారణలు
భిన్న విభిన్న సంస్కృతి సంప్రదాయాలు
వేరు వేరు జీవనరీతులు
రకరకాల చిత్తవృత్తులు
వింత బహువింత దృశ్యాలై
రక్తి కట్టించే ఉద్విగ్నభరిత కథనాలై
జీవన కాలరేఖపై సాగిపోయే
వైవిధ్యభరిత వర్ణ చిత్రాలు.
డా|| సమ్మన్న ఈటెల