విలువలకై జీవించే జీవితమే జీవితం
పలువురినలరించే సహసమే ఒక జీవితం
ప్రతిభ ఉండగానే సరిపోతుందా మనిషిలో
కృషితోనే గదా మనుషులు రుషులైనది మన గతం
ప్రవచించుట కోరకు గాదు గీతలోని సారంశం
అనుసరించి ఆచరించి చూపుటయే విధి హితం
మమతల సిరిసంపదలకు మూలధనం ప్రేమ కదా
ప్రేమ పంచి ప్రేమ పెంచు ఆకాంక్షయే ఉన్నతం
కుటుంబాన్ని ప్రపంచమని భావించే హృదయమే
వసుదైక కుటుంబకమని చాటగలదు ఖచ్చితం
అమ్మను నమ్మినవారికి ఆత్మానందం కరువా
'మోహన పరహిత' కామన ఉత్తమమగు మనోగతం.
….తుమ్మా రామోహనరావు