బాపు
అతని సిరి కన్నుల భగవంతుని కోవెలలెన్నువి.
ఆ కోవెల లలోన నిర్భాగ్యుల జీవన జ్యోతులున్నవి
అతని మాటలలోన మృదు మంజుల అలలున్నవి
ఆ అలలకు సుమధుర సంగీతపు లయలున్నవి.
అతని చిరు నవ్వులలోన ఎన్నో సిరులున్నవి
ఆ సిరి సంపదలో అతని ఎదదాగున్నది.
అతని మోహన మూర్తిలో సమ్మోహన రూపమున్నది.
ఆరూపంలో శాంతి దేవత అంశమున్నది.
అతని ఆత్మకు రవితేజం తోడున్నది.
ఆ తేజంలో నవ భారత మిముడున్నది.
~~ జనపరెడ్డి సత్యనారాయణ