నీవు
ఆదినుంచీ అర్ధమవుతూనేవుంది
అయినా నా ప్రాణం నీచుట్టూ తిరుగుతూనేవుంది
తొలిచూపులోనే మనము కలిసిందని పలికి
మనువు కుదిరేనాడు మమత మాయం చేసావ్?
కొండలాంటి గుండెనీదని అండగా నన్నుండమని
చిట్టెలుకలాజేరి చివరకు గుండెనే పిండివేసావ్
రాయిలాపడివున్న నిన్ను రవ్వనుచేసి యెదచేరిస్తే
యెదపైనే పీఠంవేసి నిప్పురవ్వలు కురిసావ్?
నీ కళ్ళవెలుగు నాకళ్లలో చూడమని వేలుచూపిస్తే
నావేలితో నాకన్నేపొడిచి చూపు దూరం చేశావ్?
ఆదినుంచీ నీతత్త్వం అర్ధమవుతూనేవుంరి !
అయినా నా ప్రాణం నీచుట్టూ తిరుగుతూనేవుంది!!
....శర్మాజీ