జీవనదృశ్యాలు
(నానీలు)
ఇల్లంటే
వైశాల్యమే కాదు
హృదయాల్లోని
ప్రేమ విస్తీర్ణం కూడా
నా నాయనవ్వ
తలిరుటాకు
కసికెతో గోకిచ్చిన
పాలగోకు
అవ్వ పెట్టిన
రాముల్కాయల కూర
ఇప్పటికీ
నా మెదడు నాల్కమీద
పండ్లు తోముకుంట
ఊరంతా మా తాత
భుజం మీదెక్కి
నేనేమో ఒకటే మోత
మామా!
నీ బిడ్డ తిడుతుంది
పరవాలేదు
అందులో న్యాయముంది
మా చిన్నాన్న కాల్చిచ్చిన
బూరు తీయ్యని కంకులు
రత్నాలు
ఒలుచు తిన్నట్టే
........డా|| కాలువ మల్లయ్య