• చిగురుకల కు స్వాగతం

గజల్

గజల్

 

తెలుగు కవితను గుండెగుండెకు చేర్చునది ఈ నా గజల్‌

అలతి పదముల అనుభవాలను పేర్చునది ఈ నా గజల్‌

 

 

ప్రియ సఖుల తలపోయునప్పుడ తీయ్యనిది సుఫీ కవిత్వం

తెలుగుభాషకు ఉరుదు హోయలను కూర్చునది ఈ నా గజల్‌

 

 

మనిషి మనిషిని ఒక మనిషిగా మార్చు సాహితి క్రతువులో

మనసులన్నీ మలిన రహితమోనర్చునది ఈ నా గజల్‌

 

 

మనిషి మనిషికి నడుమ దూరము పెరుగు చీకటి వేళలో

మట్టి ప్రమిదను మనిషి గుండెగ మార్చునది ఈ నా గజల్‌

 

 

మతము ప్రాంతమదేది యైనా మానవత్వపు దీప్తికై

'మోహనా' నా తోటి వారల తీర్చునది ఈ నా గజల్‌.

 

 

 

                   తుమ్మా రామోహనరావు

 

 

 

 

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon