కొనుక్కుందాం రండి !
అందమైన పల్లెనేల బోసిపోయింది,
పచ్చని పొలాలు మట్టి వాసన,
లేకుండా పోయింది !
అప్పటి తరం మధ్యన ఉన్నది,
అంత ఉమ్మడి కుటుంబాలు !
అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు,
అమ్మ, నాన్న, అన్నదమ్ములు,
అక్కచెల్లెళ్లు, పిన్ని, బాబాయి, బావలు వగైరా
అప్యాయతలు, అనురాగాలు,
ప్రేమగా, మాట్లాడుకునే రోజులు
ఆ జ్ఞాపకాలు, అనుభూతులు
మళ్లి తిరిగి ఉదయించని రోజులు
శుభకార్యాల సంబరాలు
అందరూ కలిసి సందడి చేసే రోజులు
నిన్నటి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి
చేతి వంటకాల రుచులు -
నిత్య విందు భోజనాలు
వడ్డించిన అప్యాయతలు, అనురాగాలు
షడ్‌రుచుల సంతృప్తికర భోజనంలా ఉండేది
@@@
వ్యక్తిగత జీవితాల మధ్య దూరాలు పెరిగాయి
ఆచారాలు సంప్రదాయాలు వెలిసిపోతున్న రంగులు
కనుమరుగయిన అనవాలు తిరిగిరాని తీపి గుర్తులు
కాలం మారలేదు కానీ, మనిషి మారిపోయాడు
అన్ని వెలతో, వేలతో ముడిపడ్డ బతుకులు
జేబులు బరువుగా ఉంటేచాలు
రుచిశుచి ఆలోచించకండి
పచ్చనోటు విసిరిచూడు
హోమ్ ఫుడ్స్ మీ గుమ్మంలో
నిలబడి నవ్వుతుంటాయి
ఒకసారి రుచిచూడమని...
కొత్తదనం కోసం, కొంత ధనం వెచ్చిస్తేనేం
కొనుక్కునే జీవిద్దాం రండి !
…… శివకోటి నాగరాజు