• చిగురుకల కు స్వాగతం

ఓ మనసా !

ఓ మనసా !

గుప్పెడంత జీవితంలో ఆకాశమంత ఆశలు

అందని ఆశయాలకు అర్రులు చాచేవు

అవి కొండెక్కి కూర్చుంటే అలమటించేవు

నీ మనసుకు తుది ఏది ఓ మనసా !

 

తన మన అనే తారతమ్యల మధ్యన

గజిబిజి జీవన ప్రయాణం

భారం చేయకు ఓ మనసా !

 

ఉన్ననాడు మిడిసిపడకు

లేనినాడు ఎగసిపడకు

కలిమిలేమి చెలిమిలో

కొట్టుమిట్టడకు ఓ మనసా !

 

అంతర్గతంగా నీలో నిద్రించే

శక్తియుక్తులను ప్రదర్శించి

పరమాత్మకు నైవేద్యంగా సమర్పించు

ఆత్మసంతృప్తిని వరించేవు ఓ మనసా !

 

జీవితం మోసాల పట్టికని తెలిసినా..

జరిగిపోయినవాటికి వేదనతో చింతించకు

కాలం పెట్టే పరీక్షకు జంకకు

శంకర కృప నీకు  కొండత అండ ఓ మనసా !

 

ఎవరికి ఎవరూ కానీ ప్రపంచంలో -

నాకు నీవే తోడు ఓ మనసా !

ఈ అనంత విశ్వం సాక్షిగా -

నాకు నీవు, నీకు నేను

తోడు నీడగా కలిసి నడుద్దాం

ఊరడిల్లుము ఓ మనసా !

 

 

 

కె. స్వరాజ్యలక్ష్మి

 

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon