• చిగురుకల కు స్వాగతం

గతవైభోగాలు

గతవైభోగాలు

 

మిత్రమా....

 

గతించిన కాలం తిరిగిరానిది,

 

నీ గతవైభోగాలు తీయనివైతే

 

జీవితకాలం గుర్తుంచుకో

 

చేదు జ్ఞాపకాలైతే

 

కాలంతోపాటు గతించనీ,

 

గతాన్నీ తవ్వుకొని  వ్యధచెందకు,

 

అది నీ భవిష్యత్‌ను అంధకారం చేయగలదు,

 

చేదు నిజాలు సైతం గతంతో గతించిపోతాయి,

 

మదిని తొలిచే వేదనతో దిగులుచెందకు,

 

అది నీ భవితకు అడ్డు గోడకాగలదు,

 

నీ మనసును ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉరకలు వేయనీ,

 

అది నీ బంగారు భవితకు సోపానం కాగలదు,

 

మిన్ను విరిగి మీదపడినా సత్యమునే పలికి

 

నీ జన్మసార్ధకం చేసుకో,

 

కొంత స్వార్ధాన్ని విడనాడి

 

ప్రజాసేవకు పాటుపడు

 

                                                                                                                                                                                       …………..రాయవరపు సరస్వతి






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon