• చిగురుకల కు స్వాగతం

జలతారుల.....

 

జలతారుల పరదాలుగ కనుపాపల చెమ్మ చూపు దొరకదెక్కడ

 

వసతి వదిలి కదిలిపోతే  నీ నీడకు నీదు రూపు దొరకదెక్కడ

 

 

నడి నెత్తిన ఎండ వేడి నిలువెత్తున నీ ఉనికిని నీరు చేస్తుంటే

 

నీలి కురుల గొడుగు నీడ పట్టే  ఆచెలియ ప్రాపు దొరకదెక్కడ

 

 

కంటి నుండి జాలువారు ఆశ్రుధార పొగమంచు కాదు కాదుగా

 

బతుకు బీడు పడనీయకు మమతల వరి నారు మోపు దొరకదెక్కడ

 

 

కునుకు పడని కనుల తోడ కలల వెంట పరుగులింక మానకపోతే

 

కనురెప్ప వాల్చి నడుం  వాల్చేందుకు చిట్టి పాన్పు దొరకదెక్కడ

 

 

 

చిరునవ్వుల హాయినొదలి భ్రమల గాలి పటమ్మీద ఎగురుతూఉంటే

 

నేల పైనే ఉన్నది  దియా మనకు ఇంటి దాపు దొరకదెక్కడ

 

 

 

~తుమ్మూరి రామ్మోహనరావు






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon